RRC Railway Jobs 2025: పదో తరగతి, ఇంటర్ అర్హతతో రైల్వేలో 3115 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

గత కొంత కాలంగా రైల్వేలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా మరో రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో మొత్తం 3115 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే..

RRC Railway Jobs 2025: పదో తరగతి, ఇంటర్ అర్హతతో రైల్వేలో 3115 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
RRC Eastern Railway Jobs

Updated on: Aug 02, 2025 | 2:47 PM

ఈస్టర్న్‌ రైల్వే కోల్‌కతా.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,115 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్‌, పెయింటర్‌, లైన్‌మెన్‌, వైర్‌మెన్‌, ఆర్‌ఈఎఫ్‌&ఏసీ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌.. విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 14, 2025వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • హౌరా డివిజన్‌ పోస్టుల సంఖ్య: 659
  • లిలువా వర్క్‌షాప్‌ పోస్టుల సంఖ్య: 612
  • సీల్డా డివిజన్‌ పోస్టుల సంఖ్య: 440
  • కాంచ్రపార వర్క్‌షాప్ పోస్టుల సంఖ్య: 187
  • మాల్డా డివిజన్ పోస్టుల సంఖ్య: 138
  • అసన్‌సోల్‌ డివిజన్‌ పోస్టుల సంఖ్య: 412
  • జమలాపూన్‌ వర్క్‌షాప్‌ పోస్టుల సంఖ్య: 667

పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 14, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 13, 2025వ తేదీ రాత్రి 11.59 గంటలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు తుది గడువు ముగుస్తుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు తప్పనిసరిగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.