AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB ALP Recruitment 2024: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. టెన్త్‌ పాసైతే చాలు!

రైల్వే శాఖ పరిధిలోని దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న దాదాపు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం..

RRB ALP Recruitment 2024: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. టెన్త్‌ పాసైతే చాలు!
IBPS ALP Recruitment 2024
Srilakshmi C
|

Updated on: Jan 21, 2024 | 5:13 PM

Share

రైల్వే శాఖ పరిధిలోని దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న దాదాపు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

మెట్రిక్యులేషన్‌తో పాటు ఫిట్టర్‌/ఎలక్ట్రీషియన్‌/ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌/మిల్‌రైట్‌/మెయింటెనెన్స్‌ మెకానిక్‌/మెకానిక్‌- రేడియో అండ్‌ టీవీ/ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/మెకానిక్‌- మోటార్‌ వెహికల్‌/వైర్‌మ్యాన్‌/ట్రాక్టర్‌ మెకానిక్‌/ఆర్మేటర్‌ అండ్‌ కాయిల్‌ వైండర్‌/మెకానిక్‌- డీజిల్‌/హీట్‌ ఇంజిన్‌/టర్నర్‌/మెషినిస్ట్‌/రిఫ్రజెరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ మెకానిక్‌ విభాగంలో ఐటీఐ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతంగా చెల్లిస్తారు.

కేటగీరీ వారీ పోస్టుల వివరాలు..

  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 2499
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 804
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 482
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 1351
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 560
  • ఎక్స్‌ఎస్‌ఎం కేటగిరీలో పోస్టుల సంఖ్య: 572

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీ ఖాళీలు ఇలా..

  • అహ్మదాబాద్‌లో ఖాళీలు: 238
  • అజ్‌మేర్‌లో ఖాళీలు: 228
  • బెంగళూరులో ఖాళీలు: 473
  • భోపాల్‌లో ఖాళీలు: 284
  • భువనేశ్వర్‌లో ఖాళీలు: 280
  • బిలాస్‌పూర్‌లో ఖాళీలు: 1,316
  • చండీఘడ్‌లో ఖాళీలు: 66
  • చెన్నైలో ఖాళీలు: 148
  • గువాహటిలో ఖాళీలు: 62
  • జమ్ము అండ్‌ శ్రీనగర్- 39
  • కోల్‌కతాలో ఖాళీలు: 345
  • మాల్దాలో ఖాళీలు: 217
  • ముంబయిలో ఖాళీలు: 547
  • ముజఫర్‌పూర్‌లో ఖాళీలు: 38
  • పట్నాలో ఖాళీలు: 38
  • ప్రయాగ్‌రాజ్‌లో ఖాళీలు: 286
  • రాంచీలో ఖాళీలు: 153
  • సికింద్రాబాద్‌లో ఖాళీలు: 758
  • సిలిగురిలో ఖాళీలు: 67
  • తిరువనంతపురంలో ఖాళీలు: 70
  • గోరఖ్‌పూర్‌లో ఖాళీలు: 43

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్