RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?

రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో ముగియనుంది. తాజాగా ఈ తుది గడువును రైల్వేబోర్డు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ పోస్టులకు..

RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు మరో ఛాన్స్... ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?
RRB Railway Technician Jobs

Updated on: Jul 27, 2025 | 7:25 PM

హైదరాబాద్‌, జులై 27: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో ముగియనుంది. తాజాగా ఈ తుది గడువును రైల్వేబోర్డు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఆగస్టు 7, 2025 వరకు పొడిగించింది. అప్లికేషన్‌ ఫీజును ఆగస్టు 9వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు సవరణలకు ఆగస్టు 10 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సవరించిన తేదీలతో కూడిన షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

కాగా రైల్వే శాఖలో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్‌- 1, గ్రేడ్‌- 3 పోస్టులకు గత నెలలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,055 వరకు ఉన్నాయి. జులై 28వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుండగా.. గడువును పెంచుతున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, సర్టిఫికెట్లు వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌లు తదితరాల ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది.

జులై 28 ముగుస్తున్న ఐబీపీఎస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్‌).. 6,125 ప్రొబేషనరీ ఆఫీసర్స్‌, మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 28తో ముగియనుంది. ఇక అప్లికేషన్‌ ఫారమ్‌లో తప్పులు సవరించుకోవడానికి జులై 31, ఆగస్టు 1 తేదీల్లో అవకాశం ఉంటుంది. మొత్తం పోస్టుల్లో ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్‌, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 5208, స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టులు 1,007 వరకు ఉన్నాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.