
దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,055 వరకు ఉన్నాయి. ఈ పోస్టులను సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్లలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఎస్సీ, బీఈ/ బీటెక్ లేదా ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ లేదా ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ మోటార్ వెహికిల్/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణలై ఉండాలి. వయోపరిమితి కింద జులై 1, 2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితితో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 28, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.500 వరకు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రూ.19,900 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.