RRB NTPC Phase 7 exam -2021 : ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ పరీక్ష తేదీ ఖరారు..! అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది..? ఏ పోస్టుకు ఎంత జీతం..

|

Jul 02, 2021 | 12:52 PM

RRB NTPC Phase 7 exam -2021 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 35 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన

RRB NTPC Phase 7 exam -2021 : ఆర్‌ఆర్‌బి ఎన్‌టీపీసీ పరీక్ష తేదీ ఖరారు..! అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది..?  ఏ పోస్టుకు ఎంత జీతం..
Rrb Ntpc
Follow us on

RRB NTPC Phase 7 exam -2021 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 35 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన పరీక్ష తేదీని ఖరారుచేసింది. ఇది ఎన్‌టిపిసి రిక్రూట్‌మెంట్ చివరి దశ పరీక్ష ఇందులో 2.78 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారు. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆర్ఆర్బి ఎన్టిపిసి ఫేజ్ 7 పరీక్షలు 23, 24, 26, 31 జూలై 2021 న జరుగుతాయి. అభ్యర్థుల కోసం పరీక్షా నగరం, తేదీని వీక్షించడానికి, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచిత ట్రావెల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి పరీక్షకు పది రోజుల ముందు వివరాలను ఆర్‌ఆర్‌బి వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు కాల్ లెటర్‌తో పాటు COVID కి సంబంధించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఫేస్ మాస్క్‌ల వాడకం తప్పనిసరి అని గమనించాలి.

అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది?
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి పరీక్షా అడ్మిట్ కార్డు పరీక్షకు 4 రోజుల ముందు వెబ్‌సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు తమ ప్రాంతంలోని ఆర్‌ఆర్‌బి వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వారి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని సమర్పించాలి.

ఏ పోస్టుకు జీతం ఎంత?

1. టైపిస్ట్ కమ్ జూనియర్ క్లర్క్ – 19,900 రూపాయలు
2. అకౌంట్స్ కమ్ టైపిస్ట్ క్లర్క్ – 19,900 రూపాయలు
3. జూనియర్ కమ్ బుక్ కీపర్ – 19,900 రూపాయలు
4. కమర్షియల్స్ కమ్ క్లర్క్ – 19,900 రూపాయలు
5. టికెట్ గుమస్తా – 21,700 రూపాయలు
6. ట్రాఫిక్ అసిస్టెంట్ – 25,500 రూపాయలు
7. సీనియర్ టైమ్ కీపర్ – 29.200 రూపాయలు
8. సీనియర్ కమర్షియల్స్ కమ్ టికెట్ గుమస్తా – 29.200 రూ.
9. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 29,200 రూపాయలు
10. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 29,200 రూపాయలు
11. గూడ్స్ గార్డ్ – 29,200 రూపాయలు
12. స్టేషన్ మాస్టర్ – 35,400 రూపాయలు
13. కమర్షియల్ అప్రెంటిస్ – 35,400 రూపాయలు

Spiny Gourd Benfits : బోడకాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు..! మరెన్నో లాభాలు.. రెయినీ సీజన్‌లో ఒక్కసారైనా తినాల్సిందే..

Virushka Viral Photos: క్రికెటర్ పెళ్లిలో భార్యతో కలిసి చిందులేసిన టీమిండియా కెప్టెన్..! వైరలవుతోన్న ఆనాటి ఫొటోలు

Google Messages: పెద్ద ఎత్తున వస్తోన్న మెసేజ్‌లతో కన్ఫ్యూజ్‌ అవుతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్ మీ కోసమే..