
హైదరాబాద్, నవంబర్ 13: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఎన్టీపీసీ సీబీటీ 2 -2025 రాత పరీక్ష ఇటీవల దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ సహా.. ఆర్‌ఆర్‌బీ చండీగఢ్, ఆర్‌ఆర్‌బీ అలహాబాద్, ఆర్‌ఆర్‌బీ ముంబయి వంటి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల వెబ్‌సైట్‌లలో అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రైల్వే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఆర్‌ఆర్‌బీ పరిధిలోని అన్ని రైల్వే జోన్‌లలోని గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి సీబీటీ 1 రాత పరీక్షను జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అర్హత సాధించని వారికి సీబీటీ 2 పరీక్షను ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించింది. సీబీటీ 2 పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్ధులను రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తారు. ఇతర వివరాలు ఈ కింది ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ (సీబీటీ 2) 2025 ఫలితాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో 2025 సంవత్సరానికి గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ త్వరలోనే రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఈ రోజు విడుదల చేయనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తెలిపింది. అభ్యర్థులు rrbcdg.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలకు సంబంధించిన నగరాల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నియామక పరీక్ష నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. కాగా ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, హెల్పర్ అండ్ అసిస్టెంట్, పాయింట్స్ మ్యాన్ వంటి తదితర 32,438 పోస్టులను రైల్వే శాఖ ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.