RRB NTPC 2025 Railway Jobs: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు ఏకంగా 1.2 కోట్ల దరఖాస్తులు.. జూన్ 1న అడ్మిట్ కార్డులు

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులకు దేశ వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఊహించని విధంగా ఏకంగా 1.2 కోట్ల మంది ఈ పోస్టులకు దరఖాస్తు..

RRB NTPC 2025 Railway Jobs: ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు ఏకంగా 1.2 కోట్ల దరఖాస్తులు.. జూన్ 1న అడ్మిట్ కార్డులు
RRB NTPC 2025 Railway jobs

Updated on: May 27, 2025 | 4:35 PM

హైదరాబాద్‌, మే 27: రైల్వే శాఖ పరిధిలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గతేడాది నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,558 నాన్-టెక్నికల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా గతేడాదే ముగిశాయి. అయితే దేశ వ్యాప్తంగా ఈ పోస్టులకు ఏకంగా 1.2 కోట్ల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆర్ఆర్‌బీ వెల్లడించింది. కేవలం 11 వేల రైల్వే పోస్టులకు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. వీరందరికీ ఆన్‌లైన్‌ విధానంలో వచ్చే నెలలో రాత పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా తాజాగా ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది.

తాజా ప్రకటన మేరకు రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు రాత పరీక్షలు జూన్‌ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి 10.30 వరకు, సెకండ్‌ షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12.45 నుంచి 2.15 గంటల వరకు, థార్డ్‌ షిఫ్ట్ 3 సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 90 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. ఈ వ్యవధిలో అభ్యర్ధులు మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు మూడవ వంతు మార్కును తగ్గిస్తారు. ఈ పరీక్ష అడ్మిట్ కార్డులు జూన్ 1 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఎన్‌టీపీసీ నాన్‌టెక్నికల్‌ మాక్‌ టెస్టులు

రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు సంబందించి మాక్‌ టెస్టులను ఆర్‌ఆర్‌బీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి స్టేజ్‌ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే వినియోగించుకోవచ్చు. వీటిని రాయడం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.