
హైదరాబాద్, జనవరి 9: భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా విడుదల చేసింది. మొత్తం 9,970 ఏఎల్‌పీ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఆర్‌ఆర్‌బీ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి 18వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనుంది. ఈ మేరకు ఏఎల్‌పీ సీబీటీ 1 పరీక్షల తేదీలను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
ఈ మేరకు 2026 ఫిబ్రవరి 16, 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డ్ వెల్లడించింది. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ఎగ్జాం సిటీ, తేదీ వివరాలను తెలిపే ఎగ్జాం సిటీ ఇంటిమేషన్ ప్లిప్‌లను పరీక్షకు 10 రోజుల ముందు వెల్లడించనుంది. ఇక అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి 4 రోజుల ముందు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు తమతోపాటు అడ్మిట్‌కార్డు, అలాగే ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ డాక్యుమెంట్ తప్పక తీసుకెళ్లాలి. అలాగే ఎలాంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్లను తమతోపాటు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు. మిగతా సూచనలు అడ్మిట్ కార్డు వెలువడిన తర్వాత అందులో సూచించిన విధంగా పాటించవల్సి ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ ఎగ్జామ్ షెడ్యూల్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.