RRB Technician Jobs: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మళ్లీ ఛాన్స్‌!

|

Sep 30, 2024 | 4:32 PM

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ కొలువుల భర్తీకి ఈ ఏడాది మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈపోస్టులను భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న ప్రకటించింది..

RRB Technician Jobs: రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మళ్లీ ఛాన్స్‌!
RRB Technician Jobs
Follow us on

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ కొలువుల భర్తీకి ఈ ఏడాది మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈపోస్టులను భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 8,052 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు 5,154 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వారీగా చూస్తే యూఆర్‌- 6171, ఎస్సీ- 2014, ఎస్టీ- 1152, ఓబీసీ- 3469, ఈడబ్ల్యూఎస్‌- 1481 చొప్పున పోస్టులు భర్తీ చేస్తారు.

ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు కూడా వెల్లడించింది. ఇందులో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 వరకు ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716 పోస్టులు, అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెరిగిన నేపథ్యంలో మరోమారు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆర్‌ఆర్‌బీ అవకాశం ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రాధామ్యాలు ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900ల చొప్పున ప్రారంభ వేతనం చెల్లిస్తారు.

అర్హతలు ఏమేం ఉండాలంటే..
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్‌/ మెకానిక్ డీజిల్‌/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితర విభాగంలో ఉత్తీర్ణ పొంది ఉండాలి. లేదంటే 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్‌) ఉత్తీర్ణలై ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ రీజియన్ వారీగా ఖాళీల వివరాలు ఇవి..

  • ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్- 1015
  • ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్- 900
  • ఆర్‌ఆర్‌బీ బెంగళూరు- 337
  • ఆర్‌ఆర్‌బీ భోపాల్- 534
  • ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్- 166
  • ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్- 933
  • ఆర్‌ఆర్‌బీ చండీగఢ్- 187
  • ఆర్‌ఆర్‌బీ చెన్నై- 2716
  • ఆర్‌ఆర్‌బీ గువాహటి- 764
  • ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్‌ శ్రీనగర్- 721
  • ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా- 1098
  • ఆర్‌ఆర్‌బీ మాల్దా- 275
  • ఆర్‌ఆర్‌బీ ముంబయి- 1883
  • ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్- 113
  • ఆర్‌ఆర్‌బీ పట్నా- 221
  • ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్- 338
  • ఆర్‌ఆర్‌బీ రాంచీ- 350
  • ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్- 959
  • ఆర్‌ఆర్‌బీ సిలిగురి- 91
  • ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం- 278
  • ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్‌- 419

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.