RITES Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖు చెందిన రైట్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సివిల్–25, మెకానికల్–15, ఎలక్ట్రికల్–08 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 25.08.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..