ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో 202-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫేజ్-4 కౌన్సెలింగ్‌కు అర్హులైన అభ్యర్ధుల జాబితా బుధవారం (నవంబర్ 23) విడుదలైంది. కాగా ఈ నాలుగు క్యాంపస్‌లలో 4,400 సీట్లు ఉండగా, గతంలో నిర్వహించిన మూడు కౌన్సెలింగ్‌లకు 44,208 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం దాదాపు 125 సీట్లు (జనరల్ కోటాలో 120, ఎన్‌సీసీలో 3, సీఏపీలో 1, ఓహెచ్ కోటా 1 సీట్లు) మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన సీట్లకు నవంబరు 27న నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఫేజ్ 4 కౌన్సెలింగ్ కింద భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్‌సీసీ, క్యాప్, ఓహెచ్ కోటా సీట్లను సైతం నాలుగో దఫా కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా సూచించింది.
కాగా ఏపీ ట్రిపుల్ ఐటీల్లో సీట్లు మిగిలిపోవడం, నాలుగు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా ప్రతియేటా మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లన్నీ భర్తీ అయ్యేవి. మిగిలిన సీట్లకు రెండో విడతలో చేరిపోయేవారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో డైన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.