AP RGUKT IIIT Admission 2022-23: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, నూజివీడు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో.. 2022-23 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరు సంవత్సరాల బీటెక్ కోర్సులో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మొదటి ప్రయత్నంలోనే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022వ సంవత్సరంలో పది పాస్ అయిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన, టెన్త్ పాస్ అయిన విద్యార్ధులు ఎవరరైనా ఆర్జీయూకేటీలో ప్రవేశాలు పొందడానికి ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.250లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.150లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.