SBI Jobs: ఎసీబీఐలో ఆఫీసర్ పోస్టులకు అప్లై చేశారా.? దరఖాస్తులకు ఇంకా ఒకే రోజు
దేశీయ అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ స్థాయి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో మొత్తం 217 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేటితో (శుక్రవారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

దేశీయ అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ స్థాయి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో మొత్తం 217 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేటితో (శుక్రవారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 217 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ ఉద్యోగాల్లో 182 పోస్టులను రెగ్యులర్, 35 పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు.
* వీటిలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ వీపీ, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తు ఫీజుగా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు మే 19ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఆన్‌లైన్ పరీక్షను జూన్ నెలలో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
* అప్లై చేయడానికి క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..