భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో.. 291 ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- జనరల్, డీఈపీఆర్, డీఎస్‌ఐఎం పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. జులై 9 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు ఆయా తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.