Railway Jobs: ఐటీఐ అర్హ‌తతో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగాలు.. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే..

|

Jan 25, 2022 | 6:43 AM

Railway Jobs: ఇటీల‌వల ఇండియ‌న్ రైల్వే వ‌రుస‌గా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌పుర్త‌ల‌లోని రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీలో వివిధ ట్రేడుల్లో ఉన్న...

Railway Jobs: ఐటీఐ అర్హ‌తతో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగాలు.. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే..
Follow us on

Railway Jobs: ఇటీల‌వల ఇండియ‌న్ రైల్వే వ‌రుస‌గా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌పుర్త‌ల‌లోని రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీలో వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 56 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ప‌దో త‌ర‌గ‌తితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 20-12-2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే, ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 31-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Shoaib Akhtar: టీమిండియాలో ఐక్యత లోపించింది.. అందుకే టెస్టు, వన్డే సిరీస్ ఓడిపోయారు..

అందాల అనైక ఫోజులకు కుర్రకారు మతిపోవాల్సిందే..

Cyber Fraud: మరోసారి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. మహేశ్ బ్యాంకులోని రూ.12 కోట్లు మాయం..