Railway Recruitment 2021: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 8043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 1074 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 23వ తేదీలో దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం రూ. https://dfccil.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇక మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. సదరన్ రైల్వేలో 3,378 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
పెరంబూర్‌లోని క్యారేజ్ వర్క్స్‌లో 936, గోల్డెన్ రాక్ వర్క్‌షాప్‌లో 756, పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్‌లో 1,686 పోస్టులు ఉన్నాయి. వీటి దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముంబై కేంద్రంగా పని చేస్తున్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,591 అప్రెంటిసిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదవ తరగతి పాసై ఉండటంతో పాటు.. సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జూన్ 24 చివరి తేదీగా ప్రకటించారు.
Also read: