TS Police Training: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో పోలీస్ పోస్టులు (Police Jobs) కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 18,334 ఖాళీలకు తర్వలోనే నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయనున్నారు. దీంతో పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. ఓవైపు రాత పరీక్షతో పాటు మరోవైపు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం కుస్తీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల పరీక్షకు సిద్ధమయ్యే వారికోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. ఇందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులకు ప్రీరిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ పేరుతో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ మహేశ్ తెలిపారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేయదలుచుకున్న అభ్యర్థులు రాచకొండ పోలీసులు పేర్కొన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లేదా, దగ్గరల్లోని పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇక ఉచిత శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డ్, నివాస, కుల ధ్రువీకరణ జిరాక్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ సదవకాశాన్ని అర్హులైన ప్రతీ ఒక్క అభ్యర్థి వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Also Read: Ginger: అలెర్జీకి చెక్.. జలుబు మటుమాయం.. చిన్న అల్లం ముక్క తింటే ఇన్ని ఉపయోగాలా..!
GDCA: జీడీసీఏ వైస్ ప్రెసిడెంట్‌గా కేంద్ర మంత్రి కొడుకు మహానార్యమన్ సింధియా నియామకం..