GDCA: జీడీసీఏ వైస్ ప్రెసిడెంట్‌గా కేంద్ర మంత్రి కొడుకు మహానార్యమన్ సింధియా నియామకం..
కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) కుమారుడు మహానార్యమన్ సింధియా(Mahanaryaman Scindia) గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ (GDCA) వైస్ ప్రెసిడెంట్‌గా ఆదివారం నియమితులయ్యారు...
కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా(Jyotiraditya Scindia) కుమారుడు మహానార్యమన్ సింధియా(Mahanaryaman Scindia) గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ (GDCA) వైస్ ప్రెసిడెంట్‌గా ఆదివారం నియమితులయ్యారు. ఈ మేరకుఆ సంస్థ ఆఫీస్ బేరర్ తెలిపారు. ఇటీవల జరిగిన సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆదివారం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. కొత్త కార్యవర్గంలో మాజీ ఐఏఎస్ అధికారి ప్రశాంత్ మెహతా కొత్త అధ్యక్షుడిగా నియమితులు కాగా 26 ఏళ్ల మహానార్యమన్ జీడీసీఏ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా GDCAకు మద్దతుగా నిలిచారని జీడీసీఏ కార్యదర్శి అహుజా చెప్పారు.
సింధియా కుటుంబానికి సన్నిహితుడైన బిజెపి నాయకుడు పంకజ్ చతుర్వేది, మహానార్యమన్ క్రీడా ప్రేమికుడని.. అతని నియామకం క్రికెట్ ప్రతిభను పెంచుతుందని అన్నారు. గ్వాలియర్ డివిజన్ “దీనిని రాజకీయంగా చూడకూడదు. అతను క్రికెట్ ప్రేమికుడు, ఈ ప్రాంతంలోని క్రీడాకారుల సౌకర్యాల బలోపేతం కోసం సన్నిహితంగా పనిచేస్తున్నాడు” అని తెలిపారు.
Read Also.. IPL 2022: ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొస్తున్న ఆటగాళ్లు.. టాప్ 5లోకి దూబే, లివింగ్‌స్టోన్..