IIT Madras Recruitment 2022: నెలకు రూ.లక్ష జీతంతో..ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Madras).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IIT Madras Recruitment 2022: నెలకు రూ.లక్ష జీతంతో..ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..
Iitm
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2022 | 8:30 AM

IIT Madras Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT Madras).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు:

  • ట్రైనీ పోస్టులు: 3
  • ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 3
  • ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌/సీనియర్‌ ప్రాజెక్ట ఆఫీసర్‌ పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 10,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, నాన్‌ ఇంజనీరింగ్‌ పీజీ డిగ్రీ, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

GMC Mahabubnagar Jobs: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 98 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.1,90 వేల జీతం..