PM Internship Scheme 2025: పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేశారా? చివరి తేదీ పొడిగిస్తూ కేంద్రం ప్రకటన

పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ పొడికిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 12వ తేదీతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. తాజాగా ఈ తేదీని పొడిగిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది..

PM Internship Scheme 2025: పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేశారా? చివరి తేదీ పొడిగిస్తూ కేంద్రం ప్రకటన
PM Internship Scheme 2025

Updated on: Mar 18, 2025 | 7:17 AM

నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ పొడికిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించనుంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 12వ తేదీతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. తాజాగా ఈ తేదీని పొడిగించిన సర్కార్ మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు తుది గడువు ముగిసేలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్ధులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. దీనితోపాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్‌ రూంలో.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది.

రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఎవరు అనర్హులంటే ?

పదో తరగతి పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. ఆన్‌లైన్‌/దూరవిద్య ప్రోగ్రామ్‌లో చదువుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం రూ. 8 లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు, సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా కేంద్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us