Paytm Job Notification: కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్నా.. కొన్ని సంస్థలు ఉద్యోగానియమకాలు చేపట్టడంతో .. నిరుద్యోగులకు కొంచెం ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటి రంగ సంస్థలు ఉద్యోగులను నియమించుకోవడానికి దఖాస్తులను విడుదల చేయగా.. తాజాగా ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది.
పేటీఎం దేశవ్యాప్తంగా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం చేపట్టింది. 20 వేల ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఈ సంస్థ డిజిటల్ ఉపకరణాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకుగానూ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం చేపట్టింది.
ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్ ఉత్తీర్ణత. ఆసక్తి ఉన్న డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకొనవచ్చు. వేతనం +కమిషన్ కలుపుకొని నెలకు రూ.35 వేలు సంపాదించుకొనే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి ఇది మంచి అవకాశమని ప్రకటనలో పేర్కొంది. అయితే ఉద్యోగ నియమంలో అభ్యర్థులకు బైక్ ఉండి సేల్స్ రంగంలో అనుభవం వారికీ అధిక ప్రాధాన్యత ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ ఉద్యోగంలో విధులు నిర్వర్తించే అభ్యర్థులు ఎఫ్‌ఎస్‌ఈలు.. క్యూఆర్ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పోస్ట్‌పెయిడ్, రుణాలు, ఇన్సూరెన్స్‌లు ఇలా పేటీఎం కు చెందిన ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
Also Read: Significance of Kumkum: హిందూ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకున్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా (photo story )
Tokyo Olympics 2021: 41 ఏళ్ల నిరీక్షణకు తెరదింపిన భారత హాకీ జట్టు.. బ్రిటన్‌పై గెలిచి సెమీస్‌లో అడుగు