Online Classes: క్లాస్‌ల నిర్వహణపై ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం.. కరోనా నేపథ్యంలో మరో..

|

Jan 31, 2022 | 4:55 PM

Online Classes: రాష్ట్రంలోని పాఠశాలలను ఫిబ్రవరి 1నుంచి పునఃప్రారంభానికి సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. అయితే ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఇందుకు భిన్నంగా..

Online Classes: క్లాస్‌ల నిర్వహణపై ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం.. కరోనా నేపథ్యంలో మరో..
Follow us on

Online Classes: కరోనా (Corona) థార్డ్‌  వేవ్‌ కారణంగా విద్యా సంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా వరకు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలోనే తరగతులను నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత తెలంగాణలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడగించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు అనుమతులిచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలోని పాఠశాలలను ఫిబ్రవరి 1నుంచి పునఃప్రారంభానికి సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. అయితే ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆన్‌లైన్‌ క్లాసుల కొనసాగింపునకే మొగ్గు చూపింది.

ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలు తిరిగి ప్రారంభంకావాల్సి ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవర్‌ 12 వరకు యూజీ, పీజీ అన్ని సెమిస్టకర్లకి ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగించాలని ప్రకటన జారీ చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంకొన్ని రోజులు ఆన్‌లైన్‌ విద్యకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఇదిలా ఉపాధ్యాయులు మాత్రం కాలేజీకి వెళ్లి ఆన్‌లైన్‌ క్లాసులు బోధించాలని తెలిపారు.

 

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు.. కానీ అతడి ఫామ్ కలవరపెడుతుంది.. భారత మాజీ బౌలర్..

Heart Care: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ టీలు సూపర్‌.. అవేంటంటే..?

Budget 2022: అటు ఎన్నికలు.. ఇటు దక్షిణాది రాష్ట్రాల డిమాండ్స్.. కేంద్ర బడ్జెట్ ఎటు వైపు మొగ్గుతుంది?