ONGC Recruitment 2021: ప్ర‌భుత్వ సంస్థ ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

|

Jun 05, 2021 | 4:28 PM

ONGC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో ఉన్న ఈ కార్యాల‌యంలో...

ONGC Recruitment 2021: ప్ర‌భుత్వ సంస్థ ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..
Ongc Jobs
Follow us on

ONGC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో ఉన్న ఈ కార్యాల‌యంలో మొత్తం 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ రేప‌టితో ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ఫిజిషియ‌న్‌, పెడియాట్రీషియ‌న్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, జీడీఎంవో, ఎఫ్ఎంవో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఫీల్డ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు(ఎఫ్ఎంవో) పోస్టుకు ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఎంపికైన అభ్య‌ర్థ‌ల‌కు నెల‌కు రూ. 75,000 చెల్లిస్తారు.

* జీడీఎంవో పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త సాధించాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ.72,000 జీతంగా చెల్లిస్తారు.

* మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త సాధించాలి. ఎంపికైన వారికి నెల‌కు రూ.72,000 జీతంగా చెల్లిస్తారు.

* ఫిజిషియ‌న్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎండీ (జ‌న‌ర‌ల్ మెడిసిన్‌) ఉత్తీర్ణ‌త సాధించాలి. ఎంపికైన వారికి ప్ర‌తి 2 గంట‌ల‌కు రూ. 2000 చెల్లిస్తారు.

* పెడియాట్రీషియ‌న్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎండీ(పెడియాట్రిక్స్‌) ఉత్తీర్ణ‌త సాధించాలి. ఎంపికైన వారికి ప్ర‌తి 2 గంట‌ల‌కు రూ.2000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థ‌ల వ‌య‌సు పోస్టును అనుస‌రించి 45 నుంచి 60 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అభ్య‌ర్థుల‌ను విద్యార్హ‌త‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు.. ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు రేపే (06.06.2021) చివ‌రి తేదీ.
* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: SkinCare Tips: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‏ను తొలగించే దివ్య ఔషదం జామ ఆకు..

AP Weather Report: రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..

Hanuman Birthplace: హనుమంతుడి జయంతి పై , విశాఖ శారదా పీఠం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గోవిందానంద స్వామి