
NTPC Recruitment: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభత్వానికి చెందిన ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ (సీఏ/సీఎంఏ)- 20, ఎంబీఏ 10, హెచ్‌ఆర్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏ, సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ డిప్లొమా చేసి ఉండాలి.
* అభ్యర్థులను యసు 29 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 300 చెల్లించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు 21-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
YS Jagan: త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
Chicken Nuggets: 22 ఏళ్లుగా అన్ని పూటలా చికన్ ముక్కలే.. ఆ యువతి ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే