NTPC Executive Trainee Jobs 2022: నెలకు లక్షకు పైగా జీతంతో.. ఎన్టీపీసీలో 60 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు.. అర్హతలివే!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
NTPC Limited Executive Trainee Recruitment 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 60
పోస్టుల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ (CA/CMA): 20
- ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ (MBA ఫైనాన్స్): 10
- ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ హెచ్‌ఆర్: 30
వయోపరిమితి: దరఖాస్తును సమర్పించే చివరి తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/సీఎస్/ఐసీడబ్ల్యూఏ, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మార్చి 7, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: