NTA UGC NET 2021: UGC NET అడ్మిట్ కార్డ్ 2021 ఈరోజు అంటే నవంబర్ 12, 2021న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్ష నవంబర్ 20, 2021 నుంచి డిసెంబర్ 5, 2021 వరకు జరగాల్సి ఉంది. UGC NET 2021 డిసెంబర్, జూన్ పరీక్షల కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic లో అడ్మిట్ కార్డ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను తనిఖీ చేయవచ్చు. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత UGC NET అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nicలో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన తర్వాత జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే పరీక్షకు అడ్మిట్ కార్డ్ చాలా ముఖ్యం. పరీక్ష రోజున అస్సలు మర్చిపోకూడదు. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్షలో కూర్చోనివ్వని సంగతి అందరికి తెలిసిందే. పరీక్ష దగ్గర పడింది కాబట్టి అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు.
అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత ugcnetnta.nic.inలో NTA లేదా NTA UGC NET అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో ‘NTA UGC NET అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్’ లింక్ ఫ్లాష్ అవుతుంది. దానిపై క్లిక్ చేయండి.
3. మీరు మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, భద్రతా కోడ్‌ను నమోదు చేయగానే లాగిన్ పేజీకి వెళుతారు.
4. అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
5. దీన్ని డౌన్‌లోడ్ చేసి తదుపరి సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయలేకపోతే వారు ఉదయం 09:30 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య NTA హెల్ప్ లైన్‌ని సంప్రదించవచ్చు. NTA దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్న అభ్యర్థులకు, అర్హత ప్రమాణాలను పూర్తి చేయని అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్‌లను జారీ చేయదు. ఫోటో గుర్తింపుపై ఉన్న పేరు UGC NET అడ్మిట్ కార్డ్ 2021లో చూపిన పేరుతో సరిపోలాలని అభ్యర్థులు గమనించాలి.