NEET UG 2022: మళ్లీ తెరచుకున్న నీట్‌ యూజీ 2022 ఎడిట్‌ విండో.. కేటగిరీ సర్టిఫికేట్ అప్‌లోడ్‌ తప్పనిసరి!

|

Jun 15, 2022 | 8:13 AM

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు తప్పుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది..

NEET UG 2022: మళ్లీ తెరచుకున్న నీట్‌ యూజీ 2022 ఎడిట్‌ విండో.. కేటగిరీ సర్టిఫికేట్ అప్‌లోడ్‌ తప్పనిసరి!
TS PGECET 2022
Follow us on

NEET UG 2022 Correction Window re-opened: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2022) అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు తప్పుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు నీట్‌ యూజీ 2022 ఎడిట్‌ విండో జూన్ 14 నుంచి జూన్ 16 రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. మే 24 నాటి పబ్లిక్ నోటీసుకు కొనసాగింపుగా.. నీట్‌ యూజీ 2022 ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో కేటగిరీని తప్పుగా నమోదుచేసుకున్న వారు మార్చుకోవడానికి మరొక అవకాశం ఇస్తున్నట్లు ఎన్టీఏ ఓ ప్రకటనలో తెల్పింది.

కేటగిరీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయనివారు, స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఐతే అధికారుల నుంచి కేటగిరీ సర్టిఫికేట్ పొందనివారు, నిర్దేశించిన ఫార్మాట్‌లో స్వీయ-డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొంది. కేటగిరీని మార్చుకోదలచిన అభ్యర్ధులు తప్పనిసరిగా అదనపు ఫీజును చెల్లించవల్సి ఉంటుందని తెల్పింది. ఇది కేవలం వన్‌ టైం సదుపాయం మాత్రమేనని, తర్వాత ఎటువంటి వంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండబోదని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా ఎన్టీఏ తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.