NPCIL Jobs 2026: నెలకు రూ.55,932 జీతంతో న్యూక్లియర్‌ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ అర్హత

ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.. అర్హతతో న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (NPCIL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

NPCIL Jobs 2026: నెలకు రూ.55,932 జీతంతో న్యూక్లియర్‌ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ అర్హత
NPCIL Recruitment 2026 Notification

Updated on: Jan 11, 2026 | 6:35 AM

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (NPCIL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, స్టైపెండరీ ట్రైనీ, అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నీ ల్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్, హెల్త్‌ ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ప్లాంట్‌ ఆపరేటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, టర్నర్‌, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌ల్లో ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 15, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇలా..

  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ బీ(సివిల్‌) పోస్టుల సంఖ్య: 2
  • స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 95
  • ఎక్స్‌-రే టెక్నీషియన్‌ పోస్టుల సంఖ్య: 2
  • అసిస్టెంట్‌ గ్రేడ్‌ 1 పోస్టుల సంఖ్య: 15

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 4, 2026వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 4, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.150 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు రూ.55,932, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు రూ.34,286, ఎక్స్‌-రే టెక్నీషియన్‌ ఉద్యోగాలకు రూ.40,290, అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 ఉద్యోగాలకు రూ.40,290 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.