Basara IIIT Notification: బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్య సంవత్సరానికి గాను సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతీసారి పదో తరగత పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా సీట్లను భర్తీచేసేవారు. కానీ కరోనా కారణంగా పదోతరగతి పరీక్షలను రద్దు చేయడంతో ఈసారి పాలిసెట్ ఎంట్రన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు కల్పించనున్నారు. తాజాగా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..
* ట్రిపుల్‌ఐటీ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2020-21లో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన వారు మాత్రమే అర్హులు.
* విద్యార్థుల వయసు డిసెంబర్ 31, 2021 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 21 ఏళ్లు మించకూడదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
* ఆసక్తి ఉన్న వారు దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఓసీ, బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 200, ఎస్సీ, ఎస్టీలకు రూ. 150గా నిర్ణయించారు.
* తెలంగాణలోని పాఠశాలల్లో చదివిన వారు ఏడాదికి రూ.36 వేలు చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్టీ, ఎస్సీలు రూ. 500 చొప్పున చెల్లించాలి. ఇతర గల్ఫ్‌దేశాల్లో చదివిన అభ్యర్థులు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ.3.01 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది.
* దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 12 చివరి తేదీ.
* పీహెచ్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ విద్యార్థులు దరఖాస్తు చేసిన హార్డ్‌కాపీలను పంపించేందుకు చివరితేదీని ఆగస్టు 14గా నిర్ణయించారు.
* సెలక్ట్ అయిన విద్యార్థుల జాబితాను ఆగస్టు 18న విడుదల చేస్తారు.
* పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఇంజనీర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.