Bank Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్.. డిగ్రీ అర్హతతో 16,370 ప్రభుత్వ బ్యాంకు కొలువులు!

|

Nov 26, 2023 | 12:58 PM

దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, ఐడీబీఐ బ్యాంకులు తాజాగా వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటిల్లో తాజాగా స్టేట బ్యాంక్‌ ఇండియా 8,773 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు, 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు, ఐడీబీఐ 2,100 జేఏఎం-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, సిడ్బి 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నిర్ధేశించిన..

Bank Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్.. డిగ్రీ అర్హతతో 16,370 ప్రభుత్వ బ్యాంకు కొలువులు!
Bank Jobs
Follow us on

న్యూఢిల్లీ, నవంబర్‌ 26: దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, ఐడీబీఐ బ్యాంకులు తాజాగా వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటిల్లో తాజాగా స్టేట బ్యాంక్‌ ఇండియా 8,773 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు, 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు, ఐడీబీఐ 2,100 జేఏఎం-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, సిడ్బి 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నిర్ధేశించిన తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

నేడు క్యాట్‌-2023 రాత పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)-2023 ఆన్‌లైన్‌ పరీక్షలు న‌వంబ‌రు 26 (ఆదివారం) జరుగుతున్నాయి. నేడు మూడు విడతలుగా పరీక్షలు నిరుగుతున్నాయి. దాదాపు 3.30 లక్షల మంది విద్యార్ధులు ఈ సారి క్యాట్‌ పరీక్షకు పోటీపడుతున్నారు. 2022లో 2.55 లక్షలు, 2021లో 2.31 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఏకంగా 31 శాతం అధికంగా పరీక్షలు రాయడం విశేషం. వీరిలో మొత్తం అభ్యర్థుల్లో 1.17 లక్షల మంది అమ్మాయిలున్నారు. దేశంలోని దాదాపు 155 నగరాలు, పట్టణాల్లో ఈ రోజు పరీక్షలు జరగతున్నాయి.

డిసెంబర్‌ 7న ఎస్‌బీఐ అప్రెంటిస్ రాత పరీక్ష.. హాల్‌ టికెట్లు విడుదల

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహణ తేదీని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో డిసెంబర్‌ 7న ఈ పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పరీక్ష కాల్‌లెటర్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,160 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 390, తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది కాలం పాటు శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్‌ సమయంలో నెలకు స్టైపెండ్ రూ.15,000 అందిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.