AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్‌కు ఈరోజే చివరి ఛాన్స్!

NEET UG 2026 Fee Refund Today Last Date: NEET UG 2026 పరీక్ష ఫీజు రిఫండ్‌కు సంబంధించిన గడువు ఈరోజు, మే 27 రాత్రి 11:50 గంటలకు ముగియనుంది. రిఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు NEET (UG)-2026 పోర్టల్‌లో లాగిన్ అయి “Refund Link” ద్వారా బ్యాంక్ వివరాలు నమోదు చేయాలి. అవసరమైతే క్యాన్సిల్ చెక్ అప్‌లోడ్ చేయవచ్చు.

NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్‌కు ఈరోజే చివరి ఛాన్స్!
Neet Ug 2026
Rajashekher G
|

Updated on: May 27, 2026 | 10:15 AM

Share

NEET UG 2026 Fee Refund: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్న NEET UG 2026 పరీక్ష ఫీజు రిఫండ్ ప్రక్రియకు సంబంధించిన కీలక గడువు ఈరోజు, మే 27, 2026 రాత్రి 11:50 గంటలకు ముగియనుంది. పరీక్ష రాసిన అభ్యర్థుల కోసం NTA ప్రత్యేకంగా NEET (UG)-2026 రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో రిఫండ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో పోర్టల్‌లోకి ప్రవేశించి, “Refund Link” పై క్లిక్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే క్యాన్సిల్ చేసిన చెక్కును కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత వాటిలో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.

NEET ఎందుకు నిర్వహిస్తారు?

NEET (UG) 2026 పరీక్షను దేశవ్యాప్తంగా అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. MBBS సహా అన్ని వైద్య విద్యాసంస్థల్లో ఒకే విధమైన ప్రవేశ పరీక్షగా NTA దీనిని నిర్వహిస్తోంది. అలాగే BAMS, BUMS, BSMS వంటి భారతీయ వైద్య విధాన కోర్సుల ప్రవేశాలకు కూడా NEET తప్పనిసరి.

NEET పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

NEET-UG పేపర్ లీక్ కేసులో అరెస్టైన శివరాజ్ రఘునాథ్ మోటేగావంకర్ పోలీసు కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో రోజు పొడిగించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

జూన్ 21న NEET రీటెస్ట్

NEET రీటెస్ట్ జూన్ 21న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం పరీక్షార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో పరీక్షార్థులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు బీహార్ సీఎం ప్రకటించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద తాగునీరు, సత్తు వంటి సదుపాయాలు అందించాలని జిల్లా యంత్రాంగం, ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలను కూడా కోరారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి.

NEET UG 2026 Fee Refund ఎలా చేయాలి?

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. “Fee Refund Window for NEET (UG)-2026” లింక్‌పై క్లిక్ చేయండి. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా నమోదు చేయండి. Login పై క్లిక్ చేయండి. బ్యాంక్ వివరాలు నమోదు చేసి Submit చేయండి. దీంతో మీ NEET UG ఫీజు రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుంది.

Follow Us