Railway Jobs: నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ప్రయాగ్ రాజ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను స్పోర్ట్స్ కోటాలో తీసుకోనున్నారు. ఏయో క్రీడాంశాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి. లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 గ్రూస్ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్ లిఫ్టింగ్, టెన్నిస్ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఒలింపిక్ గేమ్స్/వరల్డ్ కప్/ఏసియన్ గేమ్స్/చాంపియన్స్ ట్రోఫీ/తత్సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఎగ్జామినేషన్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఇప్పటికే ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు 25-12-2021తో ముగియనున్నాయి.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
CM KCR: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే రైతుబంధు నగదు జమ..
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?