School Holidays: ‘రేపు పాఠశాలలకు సెలవు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న ఆ వార్తల్లో నిజం లేదు’

|

Nov 14, 2023 | 2:19 PM

ప్రతీయేట భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నవంబర్‌ 14వ తేదీని బాలల దినోత్సవం అన్ని పాఠశాలల్లో జరుపుకోనున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తాజాగా క్లారిటీ ఇచ్చాయి. అధికారికంగా ఎలాంటి సెలవులు ప్రకటించలేదని స్పష్టం చేశాయి. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్ తోపాటు, తెలంగాణలోనూ విద్యాసంస్థలు యథావిథిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కాగా మన దేశంలో ప్రతి సంవత్సరం..

School Holidays: రేపు పాఠశాలలకు సెలవు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న ఆ వార్తల్లో నిజం లేదు
School Holidays
Follow us on

హైదరాబాద్, నవంబర్ 13: ప్రతీయేట భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నవంబర్‌ 14వ తేదీని బాలల దినోత్సవం అన్ని పాఠశాలల్లో జరుపుకోనున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తాజాగా క్లారిటీ ఇచ్చాయి. అధికారికంగా ఎలాంటి సెలవులు ప్రకటించలేదని స్పష్టం చేశాయి. దీంతో రేపు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ తోపాటు, తెలంగాణలోనూ విద్యాసంస్థలు యథావిథిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కాగా మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాం. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ రోజున బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి యేట నవంబర్‌ 14వ తేదీన తపాలా బిళ్ళను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే.

దీపావళి సెలవుల్లోనూ మార్పులు.. ఇదీ కారణం

దీపావళి పండుగకు ఆదివారం (నవంబర్‌ 12) సెలవు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం, నవంబర్ 13 (సోమవారం)వ తేదీన మాత్రం దీపావళి సెలవు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం 13న వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణ తరగతులు జరుగుతాయి. ఒకవేళ సోమవారం సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు సజావుగా నిర్వహించలేమని భావించింది. అందుకే ఈ రోజు సెలవు దినంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర ప్రభుత్వం సోమవారం దీపావళి సెలవు ప్రకటించినప్పటికీ ఈ రోజు పాఠశాలలకు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం ప్రకటించిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెలవులను గతేడాది చివర్లో విడుదల చేసింది. ఆ ప్రకారంగా తొలుత నవంబర్ 12వ తేదీ ఆదివారం సెలవు ప్రకటించింది. తాజాగా పండితులు దీపావళిని నవంబర్ 13న జరుపుకోవాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవు దినాన్ని ఈరోజుకు మార్పు చేసింది. దీంతో నవంబర్ 13వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కూడా. కానీ తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

నవంబర్ 11వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం, సోమవారం సర్కార్ ప్రకటించిన దీపావళి సెలవుతో కలుపుకుని మూడు రోజులు సెలవు ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం 13న ఇచ్చిన సెలవుదినాన్ని కేంద్రం ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో విద్యార్థులకు సోమవారం నుంచి స్కూళ్లలో యధావిధిగా తరగతులు జరుగుతాయి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.