PG Medical Students: పీజీ వైద్య విద్యార్థులపై NMC ఉక్కుపాదం.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్‌!

|

Feb 14, 2025 | 5:06 PM

పీజీ వైద్య విద్యార్థుల ట్రైనింగ్‌కు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ (NMC) తాజాగా కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందులో డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్‌పీ)లో భాగంగా కనీసం మూడు నెలల పాటు పీజీ వైద్య విద్యార్ధులు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలని NMC పేర్కొంది. ఇందుకోసం విద్యార్ధులు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది..

PG Medical Students: పీజీ వైద్య విద్యార్థులపై NMC ఉక్కుపాదం.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్‌!
PG Medical Students
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14: పీజీ వైద్య విద్యార్థులు డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం (డీఆర్‌పీ)లో భాగంగా కనీసం మూడు నెలల పాటు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) పేర్కొంది. ఇందుకోసం విద్యార్థులు అవసరాన్నిబట్టి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే అవకాశం కల్పిస్తూ ‘జాతీయ వైద్య కమిషన్‌’ ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో పీజీ విద్యార్థులు ఆయా ఆసుపత్రుల్లో పనిచేయవచ్చని తెలిపింది. ఈ మేరకు మెడికల్ విద్యార్ధులు తప్పనిసరిగా నిబంధనలు అనుసరించాలని స్పష్టం చేసింది. నాన్-క్లినికల్ స్పెషాలిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జిల్లా ఆరోగ్య అధికారి లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సమన్వయంతో శిక్షణ ఇస్తారని NMC పేర్కొంది. డయాగ్నస్టిక్స్, ప్రయోగశాల సేవలు, ఫార్మసీ, ఫోరెన్సిక్ సేవలు, సాధారణ క్లినికల్ విధులు, నిర్వాహక బాధ్యతలు, ప్రజారోగ్య కార్యక్రమాల్లో వీళ్లు పాల్గొనవచ్చు. అంతేకాకుండా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఇతర జాతీయ పరిశోధనా సంస్థల పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలు లేదా ఫీల్డ్ సైట్లలో కూడా పీజీ విద్యార్ధులను నియమించవచ్చు.

అంతర్రాష్ట్ర పోస్టింగ్‌ల కోసం అభ్యర్థనలు చాలా అరుదుగా ఉండాలని, అసాధారణమైన సందర్భాలలో మాత్రమే పరిగణించబడాలని కమిషన్ నొక్కి చెప్పింది. దీనిపై ఏదైనా రాష్ట్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వస్తే తదుపరి చర్య తీసుకునే ముందు NMC పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PGMEB) నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొంది.

తెలంగాణ గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు.. ఉపముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని, స్టడీ సర్కిళ్లను ఉద్యోగ కల్పన కేంద్రాలుగా మార్చాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు సూచించారు. 2025-26 బడ్జెట్‌ ప్రతిపాదనలకు సంబంధించి ఫిబ్రవరి 13న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఇద్దరూ మాట్లాడుతూ.. గురుకులాల్లో రెసిడెన్షియల్‌ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్‌ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని అన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జాబ్‌ క్యాలెండర్‌ను అనుసరించి శిక్షణ ఇవ్వాలని, డీఎస్సీ, బ్యాంకింగ్‌ వంటి పరీక్షలపైనా దృష్టి సారించాలన్నారు. సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో మరమ్మతులు, కిటికీలు, ప్రధాన ద్వారాలకు దోమతెరల ఏర్పాటుకు నిధులు వెంటనే కేటాయిస్తామని, అద్దె భవనాల బకాయిలు వెంటనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.