NIUM Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేన్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివరి తేదీ..

|

Jan 16, 2022 | 6:02 AM

NIUM Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేన్‌మెంట్‌ (NIUM ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పోస్టులను..

NIUM Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేన్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివరి తేదీ..
Follow us on

NIUM Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేన్‌మెంట్‌ (NIUM ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో కెపాసిటీ బిల్డింగ్‌ స్పెషలిస్ట్ (01), అర్బన్‌ ప్లానర్ (08), అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్స్‌పర్ట్ (04) పోస్టులు ఉన్నాయి.

* కెపాసిటీ బిల్డింగ్ స్పెష‌లిస్ట్ పోస్టుల‌కు అర్బన్‌ డెవలప్‌మెంట్‌/ సోషల్‌ డెవలప్‌మెంట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అర్బన్‌ ప్లానర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ప్లానింగ్‌/ తత్సమాన సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్స్‌పర్ట్ సివిల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను మొద‌ట అక‌డ‌మిక్, పన అనుభవం ఆధారంగా ఫార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ 16-01-2022.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. పూర్తి వివరాలు మీకోసం..!

PM Narendra Modi: దేశం కోసం నూతన ఆవిష్కరణలు చేద్దాం.. జనవరి 16న ‘స్టార్టప్‌ డే’గా జరుపుకుందాం: ప్రధాని మోదీ

IPL 2022 Mega Auction: మెగా వేలంలో సూపర్ సీనియర్ ప్లేయర్స్.. కనకవర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధం.. వారెవరంటే?