తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. కెమికల్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన అడ్-హక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ప్రాసెస్ కంట్రోల్/ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ కంట్రోల్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్‌లో నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ లైబ్రరీలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 19, 2022వ తేదీలోపు కింది ఈమెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్ చేసిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి ఎంపికై వారి వివరాలు డిసెంబర్ 21వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దరఖాస్తులు సంఖ్యను బట్టి రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే నేరుగా ఇంటర్వ్యూ జరుపుతారు. సంబంధిత వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 23న గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతిభకనబరచిన వారిలో పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి నెలకు రూ.60,000లు, కేవలం ఎమ్‌టెక్ డిగ్రీ కలిగిన వారికి నెలకు రూ.50,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
chemical_hod@nitw.ac.in
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.