NIT Recruitment: వరంగల్‌ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన వారికి కూడా అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.

|

Aug 20, 2021 | 4:53 PM

NIT Warangal Recruitment: వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం..

NIT Recruitment: వరంగల్‌ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన వారికి కూడా అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.
Nit Warngal
Follow us on

NIT Warangal Recruitment: వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 129 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సోమవారం (ఆగస్టు 23) నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 129 ఖాళీలకు గాను సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–06, అసిస్టెంట్‌ ఇంజనీర్‌–02, సూపరింటెండెంట్‌–08, టెక్నికల్‌ అసిస్టెంట్‌–27, జూనియర్‌ ఇంజనీర్‌–08, ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌–03, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ టెక్నీషియన్‌–19, టెక్నీషియన్‌–34, జూనియర్‌ అసిస్టెంట్‌–19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
* అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పోస్టుల ఆధారంగా అభ్యర్థుల వయసు 27 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 23-08-2021న మొదలై 23-09-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Telangana: ఓయూ పరీక్షలు వాయిదా.. శనివారం మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. విద్యా సమాచారం మీకోసం..

HSSC Recruitment: హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు.

Samsung Dost: భారత యువతకు అండగా శాంసంగ్‌ దోస్త్‌.. 50,000 మందికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా..