
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. 240 జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర (గ్రూప్ బీ, సీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విద్యార్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేసింది. దరఖాస్తు తేదీలు, విద్యార్హతలు, నియామక ప్రక్రియ వంటి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తన ప్రకటనలో తెల్పింది. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Nit Calicut
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.