NIPER Recruitment 2022: నైపర్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్‌ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

|

Jun 13, 2022 | 10:03 AM

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన అహ్మాదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (NIPER).. టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల (Teaching and Non Teaching Staff Posts) భర్తీకి..

NIPER Recruitment 2022: నైపర్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్‌ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Niper
Follow us on

NIPER Ahmedabad Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన అహ్మాదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (NIPER).. టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల (Teaching and Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 22

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

  • టీచింగ్‌ పోస్టులు: 11

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పోస్టులు

విభాగాలు: బయోటెక్నాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడిసినల్‌ డివైజస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

  • నాన్‌ టీచింగ్‌ పోస్టులు: 11

పోస్టుల వివరాలు: సైంటిస్ట్, టెక్నికల్‌ సూపర్‌వైజర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంఫార్మసీ/ఎంవీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ప్రజంటేషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.