NIOS Recruitment 2022: నెలకు రూ.51,000ల జీతంతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..

|

Nov 23, 2022 | 4:22 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌.. కన్సల్టెంట్‌ (ఐటీ), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఐటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

NIOS Recruitment 2022: నెలకు రూ.51,000ల జీతంతో.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో కన్సల్టెంట్‌ ఉద్యోగాలు..
NIOS Noida
Follow us on

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌.. కన్సల్టెంట్‌ (ఐటీ), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఐటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో బీటెక్‌/బీసీఏ/ఎంటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడు నుంచి ఐదేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 63 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు (డిసెంబర్ 10, 2022) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.36,300ల నుంచి రూ.51,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.