NIEPID Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగ్‌ జన్‌ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..

|

May 20, 2022 | 5:30 PM

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (Divyang jan).. లెక్చరర్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఆఫీస్‌ స్టాఫ్‌ పోస్టుల (Lecturer Posts) భర్తీకి..

NIEPID Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగ్‌ జన్‌ ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..
Niepid
Follow us on

NIEPID Secunderabad Teaching and Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (Divyang jan).. లెక్చరర్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఆఫీస్‌ స్టాఫ్‌ పోస్టుల (Lecturer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 19

ఇవి కూడా చదవండి

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ఎన్‌ఐఈపీఈడీ, సికింద్రాబాద్‌: 9

పోస్టుల వివరాలు: లెక్చరర్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌), అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, ఎల్‌డీసీ/ టైపిస్ట్‌, హిందీ టైపిస్ట్‌ పోస్టులు

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

  • ఎంఎస్‌ఈసీ, నోయిడా (రెగ్యులర్‌): 1

అర్హతలు: మాస్టర్స్‌ డిగ్రీతో పాటు ఎంఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

  • సీఆర్‌సీ, దావనగెరె: 4

పోస్టులు: లెక్చరర్‌ (ఆక్యుపేషనల్‌ థెరపీ), అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ప్రోస్థెటిస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్‌, ఓరియంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌.

అర్హతలు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

  • సీఆర్‌సీ, నెల్లూరు (ఏపీ): 3

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (మెడికల్‌ పీఎంఆర్‌), క్లినికల్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌.

అర్హతలు: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, బీఎస్సీ/ బీఎస్సీ(ఎంఆర్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

  • సీఆర్‌సీ, రాజ్‌నందగావ్‌ (చత్తీస్‌గఢ్‌): 2

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌/ ఓరియంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌

అర్హతలు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.