నిరుద్యోగులకు శుభవార్త.. NIAలో హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులు.. పదో తరగతి చదివిన వారు అర్హులు..!

|

Mar 22, 2022 | 6:03 AM

NIA Recruitment 2022: హెడ్ కానిస్టేబుల్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 67 పోస్టులను

నిరుద్యోగులకు శుభవార్త.. NIAలో హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులు.. పదో తరగతి చదివిన వారు అర్హులు..!
Nia Recruitment 2022
Follow us on

NIA Recruitment 2022: హెడ్ కానిస్టేబుల్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 67 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివిన తర్వాత నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వచ్చినప్పటి నుంచి ఒక నెలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను పూర్తిగా తనిఖీ చేయండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ముంబై, లక్నో, జమ్ము, కొచ్చి, కోల్‌కతా, రాయ్‌పూర్, జమ్ము, చండీగఢ్, ఇంఫాల్, చెన్నై, రాంచీ, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, జైపూర్ పాట్నా, అహ్మదాబాద్‌లలో ఖాళీలు ఉన్నాయి.

NIA రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన ఇతర పత్రాలని అందించాలి. SP (Admn.), NIA హెడ్‌క్వార్టర్స్, CGO కాంప్లెక్స్ ఎదురుగా, లోధి రోడ్, న్యూఢిల్లీకి పంపాలి. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, 43 పోస్టులు, హెడ్​కానిస్టేబుల్ 24 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హత, అనుభవానికి సంబంధించిన మరింత సమాచారం కోసం NIA వెబ్‌సైట్‌కి వెళ్లి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Almond Oil: బాదం నూనెతో కళ్లకింద నల్లటి వలయాలకి చెక్.. ఈ 5 పద్దతుల్లో ప్రయత్నిస్తే కచ్చితమైన ఫలితాలు.

Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Relationship: ఆ సమయంలో మహిళలకి, పురుషలకి ఉన్న తేడా అదే..!