NHB Recruitment: నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (NHB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంక్‌లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ (01), చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (01), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (01), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (01), సూపర్‌విజన్ ఆఫీసర్లు (10) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఏదైనా డిగ్రీ, సీఏ/ ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, బ్యాంకింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అకడమిక్ అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 29-07-2022న మొదలవుతుండగా, 22-08-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..