NGRI Recruitment: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థ వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు (05), ప్రాజెక్ట్ అసోసియేట్లు (04), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత అకడమిక్, పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 42,000 వరకు అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 13-03-2022ని చివరి తేదీగా నిర్ణియించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఉక్రెయిన్-రష్యా దాడులు భారత్‌పై ఎఫెక్ట్.. వీటి ధరలు మరింత ప్రియం
Elon Musk: మాట ఇచ్చాడు.. చేసి చూపించాడు.. వార్ జోన్లో ఎలాన్ మస్క్ కీ రోల్..
Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉంటారు.. అందులో మీరున్నారా..