NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. అటెండర్‌తో సహా అన్ని పోస్టులు..

|

Oct 26, 2021 | 8:49 AM

NFL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే యువతకు సువర్ణవకాశం. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (NFL) గొప్ప అవకాశాన్ని కల్పించింది.

NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. అటెండర్‌తో సహా అన్ని పోస్టులు..
Nfl Recruitment
Follow us on

NFL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే యువతకు సువర్ణవకాశం. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (NFL) గొప్ప అవకాశాన్ని కల్పించింది. NFL జూనియర్ ఇంజనీర్, లోకో అటెండెంట్, అటెండెంట్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్‌తో సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం183 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కంపెనీ జారీ చేసిన నోటీసు ప్రకారం.. 183 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 21 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- Nationalfertilizers.comకి వెళ్లాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు ఒక్కసారి వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా పొరపాటు కనిపిస్తే ఫారం తిరస్కరిస్తారు.

ఈ పోస్టులను భర్తీ చేస్తారు..
1. జూనియర్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్) – 87 పోస్టులు
2. జూనియర్ ఇంజనీరింగ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) – 15 పోస్టులు
3. జూనియర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) – 7 పోస్టులు
4. లోకో అటెండెంట్ – 4 పోస్టులు
5. లోకో అటెండెంట్ – 19 పోస్టులు
6. అటెండెంట్ గ్రేడ్-I – 17 పోస్టులు
7. అటెండెంట్ గ్రేడ్-I (19 అటెండెంట్) పోస్ట్
8. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ – 15 పోస్టులు

అర్హత, వయోపరిమితి
ఇందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్, లోకో అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సంబంధిత ట్రేడ్‌లో 50% మార్కులతో డిప్లొమా కలిగి ఉండాలి. ఇది కాకుండా హైస్కూల్ పాస్ అభ్యర్థులు అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బి.ఎస్సీ డిగ్రీని కలిగి ఉండాలి.

శీతాకాలంలో ఈ రోగులకు చాలా ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ముప్పు