CBSE Syllabus 2021-22: విద్యార్థులు యథావిధిగా చదవాల్సిందే.. సిలబస్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సీబీఎస్ఈ..

|

Apr 02, 2021 | 1:55 AM

New CBSE Syllabus 2021-22 for 9th, 10th, 11th, 12th Released: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ అకాడమిక్‌కు

CBSE Syllabus 2021-22: విద్యార్థులు యథావిధిగా చదవాల్సిందే.. సిలబస్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సీబీఎస్ఈ..
CBSE Syllabus
Follow us on

New CBSE Syllabus 2021-22 for 9th, 10th, 11th, 12th Released: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ అకాడమిక్‌కు సంబంధించి 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను సీబీఎస్ఈ గురువారం విడుదల చేసింది. కాగా.. ఈ నూతన విద్యా సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే కరోనా నేపథ్యంలో గతంలో పలు నిర్ణయాలు తీసుకున్న సీబీఎస్ఈ.. ఈసారి సిలబస్‌లో ఎలాంటి తగ్గింపులు లేవని స్పష్టంచేసింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో గతేడాది విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ 30 శాతం సిలబస్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. గతేడాది తగ్గించిన సిలబస్‌ తాజాగా వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గమనించుకోవాలని.. పలు సూచనలు చేసింది. ఆ నిబంధనలు ఈ ఏడాది వర్తించవని.. మినహాయింపులేవీ ఉండవని స్పష్టంచేసింది. ఈ విద్యాసంవత్సరంలో పూర్తి సిలబస్‌ను విద్యార్థులు చదవాల్సి ఉంటుందని పేర్కొంది.

కాగా.. సీబీఎస్ఈ బోర్డు.. 10, 12వ తరగతుల పరీక్షల తేదీలను ఇటీవలే సవరించింది. మే 13న జరగాల్సిన 12వ తరగతి ఫిజిక్స్‌ పేపర్‌, అప్లైడ్ ఫిజిక్స్‌ను జూన్‌ 1వ తేదీకి మార్పు చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా మే 21న జరగాల్సిన 10వ తరగతి మ్యాథమెటిక్స్‌ పేపర్‌ను జూన్‌ 2వ తేదీకి మార్చింది. అయితే.. మే 4 నుంచి జూన్‌ 1 వరకు బోర్డు ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. కావున 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌.. cbseacademic.nic.in. నుంచి సిలబస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బోర్డు సూచించింది.

అయితే.. సాధారణంగా సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తారు. రాత పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చిలో ముగుస్తాయి. అయితే, కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ పరీక్షలు ఆలస్యమవుతూ వచ్చింది. దీంతోపాటు 2021 బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో కాకుండా లిఖితపూర్వకంగా నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: