NLC Recruitment 2021: నైవేలీ లిగైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్ నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా నైవేలీలో ఎన్‌సీఎల్‌కు చెందిన జనరల్ హాస్పిటల్‌లో 43 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* నోటిఫికేషన్‌లో భాగంగా నర్సు (20), డయాలసిస్ టెక్నీషియన్ (2), ఫిజియోథెరపిస్ట్ (2), మేల్ నర్స్ అసిస్టెంట్ (10), ఫీమేల్ నర్సింగ్ అసిస్టెంట్ (4), ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్ (5) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ, బీపీటీ లేదా ఎంపీటీ, ఎస్ఎస్ఎల్‌సీ చేసి ఉండాలి.
* అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు ప్రారంభ తేదీ మే 12 కాగా, మే 22ను చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు www.nlcindia.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: షాకింగ్ ఘటన.. అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్కసారిగా లేచిన వృద్ధురాలు.. ఏం జరిగిందంటే..
కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
Gurugram Police thanks to Shikhar: దాతృత్వాన్ని చాటుకున్న గబ్బర్.. కోవిడ్ బాధితులకు మరోసారి సాయం