తెలుగు రాష్ట్రాల్లో నీట్-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే నీట్ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గతేడాది (2023-24) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్ వివరాలు ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోవచ్చు.
మే5వ తేదీన జరిగిన నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. మొత్తం 720 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు162 మార్కులుగా నిర్ణయించారు. ఏపీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులు కటాఫ్‌గా ప్రకటించారు. ఆ లెక్కగన దాదాపు 43,788 మంది ర్యాంకులు పొందారు. ఇక తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127 మార్కులు, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 49,143 మందికి ర్యాంకులు వచ్చాయి.