NEET UG 2023 Exam: మరికాసేపట్లో ప్రారంభంకానున్న నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష.. 20 లక్షల విద్యార్ధులకు ఒకేసారి..

|

May 07, 2023 | 12:14 PM

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. దేశవ్యాప్తంగా 499 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో..

NEET UG 2023 Exam: మరికాసేపట్లో ప్రారంభంకానున్న నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష.. 20 లక్షల విద్యార్ధులకు ఒకేసారి..
NEET UG Exam 2023
Follow us on

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. దేశవ్యాప్తంగా 499 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే ఛాన్సుంది. AP నుంచి నీట్‌ పరీక్షకు 140 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 68 వేలకుపైగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో దాదాపు 70 వేల మంది పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ సహా రాష్ట్రంలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నీట్‌ పరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పలు నిబంధనలు, ఆంక్షలు విధించింది. నిబంధనలు అతిక్రమించినవారిని మూడేళ్ల వరకు డిబార్‌ చేస్తామని ప్రకటించింది. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గతేడాది నీట్ పరీక్షకు  దేశ వ్యాప్తంగా 17.64లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.