NEET PG 2025 Results: నీట్‌ పీజీ 2025 ఫలితాలు వచ్చేశాయ్‌.. కేటగిరీ వైజ్‌ కటాప్‌ మార్కులు ఇవే!

NEET PG 2025 Results Declared: నీట్‌ పీజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఫలితాలను మంగళవారం (ఆగస్ట్‌ 19) సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులను..

NEET PG 2025 Results: నీట్‌ పీజీ 2025 ఫలితాలు వచ్చేశాయ్‌.. కేటగిరీ వైజ్‌ కటాప్‌ మార్కులు ఇవే!
NEET PG 2025 Results

Updated on: Aug 19, 2025 | 8:18 PM

హైదరాబాద్‌, ఆగస్టు 19: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పీజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఫలితాలను మంగళవారం (ఆగస్ట్‌ 19) సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్టు 3న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో ఒకే షిఫ్ట్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా MD, MS, DNB, DrNB (డైరెక్ట్ 6-సంవత్సరాల కోర్సులు), PG డిప్లొమా వంటి అగ్ర పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు పరిమితంగా ఉండటం వల్ల యేటా వేలాది మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. నీట్ పీజీ పరీక్ష మొత్తం 800 మార్కులకు నిర్వహించారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు.

నీట్‌ పీజీ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

కేటగిరీల వారీగా నీట్ పీజీ 2025 కట్-ఆఫ్ స్కోర్లు ఇలా..

  • జనరల్/EWS కేటగిరీలో 50 పర్సంటైల్ అంటే 276 మార్కులు
  • జనరల్ PwBD కేటగిరీలో 45 పర్సంటైల్ అంటే 255 మార్కులు
  • SC/ST/OBC/PwBD కేటగిరీలో 40 పర్సంటైల్ అంటే 235 మార్కులు

NEET PG 2025 ఫలితాలను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదా NEET PG పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
  • వెబ్‌సైట్‌లో NEET PG 2025 రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్ చేయాలి.
  • వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ ఔట్ తీసుకోవాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.